Site icon TeluguMirchi.com

యువ ‘రాజు’ ను చేసేందుకేనా..?

Rahul-Gandhi-panchayat-raj-కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ ను హీరోను చేసే పనిలో పడ్డట్లు కనిపిస్తోంది. సాక్షాత్తూ దేశ ప్రధానిని అవమానపరిచే విధంగా రాహుల్ వ్యవహరించినా ఆపార్టీ ఒక వైపు రాహుల్ ను సమర్థిస్తూనే మరో వైపు ప్రధానికి వెనక పార్టీ ఉందని సోనియా వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పును కాదని ప్రజాప్రతినిధులను రక్షించేందుకు కొత్తగా ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది. దీనికి అందరూ ఆమోదం తెలపగా రాష్ట్రపతి ఈ ఆర్డినెన్స్ పై అనుమానాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ ఆర్డినెన్స్ అమలులోకి రాలేదు. ముందు అడ్డు చెప్పని రాహుల్ మీడియా ముందు ఈ ఆర్డినెన్స్ పత్రాలను చించి వార్తల్లోకెక్కారు. ప్రధాని అమెరికా పర్యటనలో ఉండగా రాహుల్ ఇలా చేయడం ప్రధానిని అవమానించడమే అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ ఆరోపణల్లో నిజం కూడా ఉంది. ఎందుకంటే ఆర్డినెన్స్ పై ప్రధానితో చర్చించి వెనక్కు తీసుకెళ్లేలా చేయవచ్చు. కానీ ఇలా హీరోయిజాన్ని చూపించడం ఎంతవరకు సమంజసం.

ఆతరువాత ప్రధాని అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత రాహుల్ తో భేటి అయి ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మాణం చేసింది కూడా. అంటే ప్రధాని మాట కంటే యువరాజు మాటకే ఎక్కువ విలువనిచ్చింది కేంద్రప్రభుత్వం. ఇదంతా మేడం సోనియా ఆడిస్తున్న డ్రామాగా కూడా విమర్శలు వస్తున్నాయి. ముందుగా రాహుల్ ను హీరోను చేసి ఆయన ప్రతిష్టను పెంచి ఆ తరువాత ప్రధాని అభ్యర్థిగా నిలపాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ . ఇందుకు ప్రధానిని ప్రతిష్టను దిగజార్చడానికి కూడా వెనకాడడం లేదు. మరి రానున్న ఎన్నికల్లోగా రాహుల్ హీరో అవుతాడా… అతని చరిష్మా ఎంత వరకు పని చేస్తుందో చూడాలి మరి….

Exit mobile version