Site icon TeluguMirchi.com

గ్రేట్ : కేటీఆర్ మళ్లీ ట్విట్టర్ లో ఆదుకున్నాడు

ktr-twitter help

తెలంగాణ మంత్రి కేటీఆర్ తన దృష్టికి వచ్చిన ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతూ ముందుకు సాగుతున్నారు. ఈ దిశలో ఆయన టెక్నాలజీని వినియోగిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేయడం విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా కేటీఆర్ ట్విట్టర్ ద్వారా బాధితులని ఆదుకోవడం చాలా బాగుంది. ఆ మధ్య తనకు ట్విట్ చేసిన ఓ బాధితుడికి తక్షణం స్పందించి ఆదుకొన్నారు. తాజాగా, ఓ పేద ముస్లిం కుటుంబం తమని ఆదుకోవాలని విజ్ఝప్తి చేస్తూ పోస్ట్ చేసిన వీడియో పై మంత్రి స్పందించారు. పేద కుటుంబంలోని అమ్మాయి కిడ్ని ఆపరేషన్ కి రూ. 3లక్షల అవసరం అవుతాయంటూ పోస్ట్ చేసిన వీడియోపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. నీమ్స్ లో ఆపరేషన్ ప్రభుత్వం తరుపున చేయిస్తామని (We will get the transplant done in NIMS) హామీ ఇచ్చారు. మంత్రి స్పందనపై ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version