ఒమిక్రాన్ పట్ల రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేంద్రం

కరోనా వేరియంట్ ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్రపా లిత ప్రాంతాలకు లేఖలు రాశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తత, డేటా ఎనా లిసిస్, నిర్ణయాత్మకంగా వ్యవహరించడం, కంటైన్మెంట్ విషయంలో చురుగ్గా ఉండాలని ఆయన పేర్కొన్నారు. వార్ రూంలను క్రియాశీలకం చేయాలని సూచించారు.

ఒమిక్రాన్ నేపథ్యంలో కేసుల్లో చిన్నపాటి పెరుగుదల కనిపించిన ప్రాంతాలపైనా దృష్టిపెట్టాలన్నారు. జిల్లా, స్థానిక స్థాయిల్లో కంటైన్ మెంట్ చర్యలు కట్టుదిట్టం చేయాలన్నారు. అవసరమైన చోట్ల రాత్రి కర్వ్యూ విధించాలని రాజేష్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు. గత వారం రోజులుగా టెస్ట్ పాజిటివిటీ రేటు 10 శాతం, అంతకంటే ఎక్కువగా ఉన్న జిల్లాలపైన, ఐసీయూ బెడ్ ఆక్యుపెన్సీ 40శాతం, ఆ పైన ఉన్న ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు.