జపాన్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు సంబంధించిన కేసులు మరో 8 నమోదయ్యినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీనితో మొత్తం 12 కేసులకు పెరిగనట్లు ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం మీడియాకు తెల్పింది. నవంబర్ చివరి నుంచి ఈ నెల ప్రారంభం వరకు వచ్చిన ప్రయాణికులకు ఈ వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెప్పింది.
కాగా జపాన్‌లో నవంబర్ 30న మొదటి కేసు నమోదైన సంగతి తెలిసిందే. కొత్తగా వైరస్ సోకిన వారిలో 30 ఏళ్ల మహిళ, పురుషుడు కూడా ఉన్నారని చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ సీజీ కిహారా తెలిపారు. వీరిద్దరూ నవంబర్ 28న నమీబియా నుంచి వచ్చారు. అదే విమానంలో జపాన్‌కు వచ్చిన నమీబియా దౌత్యవేత్తలకు కూడా వ్యాధి సోకినట్లు గుర్తించారు.