ఆమెరికా దళాలు వెనక్కి..!

Obama-announcementఅమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈరోజు (బుధవారం) ఉదయం అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి. అమెరికా ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తానని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. రెండవసారి అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సమావేశంలో ఒబామా మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా తన కర్తవ్యాన్ని నెరవేర్చిందని స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ నుండి వచ్చే యేడాది(2014)లోగా 34,000 మంది అమెరికా సైనికులను వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, 2014లోపు ఆఫ్ఘనిస్థాన్ తో ఈ సుదీర్ఘమైన యుద్దవాతావరణం సమసిపోతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

దేశ ఆర్థిక వ్యవస్థను పెరుగుపరుస్తామని ఒబామా హామి ఇచ్చారు. మధ్య తరగతి ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటుగా, గన్ కల్చర్ నిరోధిస్తామని ఆయన తెలిపారు. బలమైన ఆర్థిక కుటుంబాలు, సముదాయాలతోనే బలమైన అమెరికా నిర్మాణం సాధ్యమని ఆయన పేర్కొన్నారు. తాను ఎప్పుడూ అమెరికా అభివృద్ధి కోసమే పాటుపడతానని ఒబామా మరోసారి స్పష్టం చేశారు.