వాహనాల నెంబర్ ప్లేట్ ఇక నుంచి పూర్తిగా కనిపించాల్సిందేనట. ఒకవేళ నెంబర్ ప్లేట్ కనిపించకపోతే మాత్రం పోలీసులు కఠిన చర్యలు తప్పవు అంటున్నారు. వాహనం ఏదైనా సరే నంబర్ ప్లేట్ తప్పనిసరిగా నిబంధనలకు లోబడి ఉండాలి. అంకెలు/అక్షరాలు కనబడకుండా చేసినా, నెంబర్ ప్లేట్ కు ఏదైనా అడ్డుగా పెట్టినా, నెంబర్ ప్లేట్ పైన ఇతర రాతలు ఉన్నా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ముఖ్యంగా కొందరు ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతుండగా.. మరికొందరు నేరాలు చేసేందుకు వాహనాల యొక్క నెంబర్ ప్లేట్ తీసేయడం, ట్యాంపరింగ్ లాంటివి చేస్తున్నారు. అంతేకాదు నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వారు మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరనే ధీమాతో ఇష్టానుసారంగా వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారకులు అవుతున్నారు.