ఇంటర్మీడియేట్ విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం – NSUI రాష్ట్ర అధ్యక్షుడు

NSUI జాతీయ క్యాంపెయిన్ శిక్ష బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా ఇంటర్మీడియేట్ విద్యార్థులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ NSUI తలపెట్టిన ఇంటర్మీడియేట్ బోర్డు ముట్టడి కార్యక్రమం NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వెంకట్ మాట్లాడుతూ

  1. పరీక్షలకు హాజరైన విద్యార్థులు అన్ని పాస్ చేయ్యాలని
  2. చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలని
  3. విద్యార్థుల మరణాలకు కారణమైన అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలి డిమాండ్ చేశారు.
    బారి సంఖ్యలో NSUI నాయకులు మరియు విద్యార్థులు ముట్టడికి యత్నిచడంతో పోలీసులు NSUI నాయకులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.