Site icon TeluguMirchi.com

ఇక ఢిల్లీలో ఉద్యమం…

seemandra-employeesఢిల్లీలో సమైక్య సెగను చూపేందుకు ఎపీఎన్జీవోలు సిద్దమవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 60 రోజులకు పైగా సమ్మెలో ఉన్న ఎన్జీవోలు కేంద్రం నుంచి ఎటువంటి సానుకూల ప్రకటన రాకపోవడంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు ఎన్జీవోలు వ్యూహరచన చేస్తున్నారు. ఈ నెల 9వ తేదీ తరువాత ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. గతంలో ఢిల్లీకి వెళ్లిన ఎన్జీవో నేతలు కేవలం జాతీయ నాయకులను కలిసి రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు. మరో మారు వారిని కలిసి విన్న వించడంతో పాటు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసే ఆలోచనలో ఎన్జీవోలు ఉన్నారు.

సమ్మెలో బాగంగా 13 జిల్లాల్లోని ఎంపీలు, కంద్రమంత్రులు ఇళ్ల ముందు ధర్నాలు, వంటా వార్పు నిర్వహించేందుకు ఎన్జీవోలు సిద్దమవుతున్నారు. ఈ నెల 5వ తేదీన రహదారుల దిగ్బంధం , అలాగే 5,6న పెట్రోల్ బంకులు, ప్రైవేట్ ట్రావెల్స్ మూసివేతకు ఇప్పటికే ఎన్జీవోలు పిలుపునిచ్చారు. 7,8 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దిగ్భంధం, దర్నాలు చేయనున్నారు. 9 నుంచి జల్లాల వారిగా దర్నాలు చేస్తూ ఢిల్లీకి వెళ్లి ఉధ్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్దమవుతున్నారు.

ఈ లోగా సీఎం చర్చలకు పిలిస్తే సీఎం నుంచి వచ్చే హామీ మేరకు ఉధ్యమం తీరు తెన్నులు మారనున్నాయని ఎన్జీవో నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు మంత్రి వర్గ ఉపసంఘం, మంగళవారం చీఫ్ సెక్రటరీతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సీఎం నేరుగా ఎన్జీవో నేతలను ఎక్షణమైన చర్చలకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది…మొత్తం మీద సమైక్య ఉద్యమం ఇక ఢిల్లీకి చేరనుంది.

Exit mobile version