సంజయ్ దత్ పై నాన్ బెయిలబుల్ వారెంట్!

sanjay-duttసంజయ్ దత్ మరో కొత్త చిక్కుకొచ్చి పడింది. తాజాగా ఆయనపై ముంబై అంధేరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ”సంజయ్ దత్ కు అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధం ఉంది. ఆయన ప్రోద్బలంతోనే నన్ను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయి” అంటూ నిర్మాత షకీల్ నూరాని కేసు దాఖలు చేశారు. విచారణకు సంజయ్ గైర్హాజరు అయినందున కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సంజయ్ తనతో ఒక చిత్రం చేసేందుకు 2002లో ఒప్పందం కుదుర్చుకుని దానిని ఉల్లంఘించారని నూరాని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి సంజయ్ తనకు 50లక్షలు తిరిగి చెల్లించాల్సి ఉందని, ఒప్పందం ఉల్లంఘన వల్ల తనకు 2కోట్లు నష్టం వాటిల్లిందని పిటిషన్ లో పేర్కొన్నారు.1993నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో శిక్ష అనుభవించేందుకు వీలుగా లొంగిపోవడానికి నెలపాటు గడువిస్తూ సుప్రీం ఇటీవలే తీర్పు చెప్పింది. అంతలోనే మరో అరెస్ట్ వారెంట్ జారీ కావడం సంజయ్ కు కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. ఇప్పటికే మానసికంగా దెబ్బతిన్న సంజు తాజా నాన్ బెయిలబుల్ వారెంట్ తో మరింత వత్తిడికి గురైనట్లు సన్నిహితులు చెబుతున్నారు.