Site icon TeluguMirchi.com

మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 2017 ఫిబ్రవరి 27న అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో అప్పటి తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు 188 సెక్షన్‌ కింద ఆమెతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన విచారణ కళ్యాణదుర్గం కోర్టులో జరిగింది. గైర్హాజరు కావడంతో ఆమెతో పాటు కేసులో ఏడుగురిపై కళ్యాణదుర్గం జూనియర్‌ సివిల్‌ జడ్జి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు.

Exit mobile version