రాష్ట్రపతి పాలనకు అవకాశం లేదు!

Shinde1ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాష్ట్రపతిపాలన పెట్టే ఆలోచన లేదని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే పేర్కొన్నారు. ఢీల్లీలో షిండే ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులను గమనిస్తున్నామని అన్నారు. శాంతి భద్రతలను రాష్ట్ర ప్రభుత్వం అదుపులోకి తీసుకువస్తుందని భావిస్తున్నామని షిండే పేర్కొన్నారు. సీమాంధ్రలో 70రోజులకు పైగా ఆందోళనలు జరుగుతుండటం, తెలంగాణ నోట్ ను కేంద్ర కేబినేట్ ఆమోదించినంతరం ఈ ఆందోళనలు మరింత తారాస్థాయికి చేరడంతో.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే, తాజాగా హోం మంత్రి చేసిన ప్రకటనతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబోతున్నారనే ఊహాగానాలకు పులిస్టాప్ పెట్టినట్లయింది. కాగా సీమాంద్ర కేంద్ర మంత్రుల రాజీనామాలను ఆమోదించబోరని కూడా షిండే చెప్పడం విశేషం.