ఫలితం లేని మంత్రాంగం.. !

t and seemandra ministersరాష్ట్ర విభజన నేపథ్యంలో.. ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర మంత్రులు కలసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఇటు ’సహకరించండి’ అంటే.. అటు ’సమైక్యంగా’ వుంచండనే నినాదాలే తప్ప మరొకటి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈరోజు (గురువారం) సీఎల్పీలో తెలంగాణ, సీమాంధ్ర మంత్రులు సమావేశమయ్యారు. అయితే, ఈ సమావేశం కూడా ఊహించినట్లుగానే ఫలితం లేని మంత్రాంగంగా మిగిలిపోయింది. తెలంగాణ మంత్రులు జానారెడ్డి, సారయ్య.. తదితరులు సీమాంధ్ర నేతలు తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. దీనికి సమాధానంగా సీమాంధ్ర మంత్రులు గంటా,ఎరాసు ప్రతాపరెడ్డిలు, విభజన వల్ల ఇరు ప్రాంతాలకు నష్టమని..మీరు చెప్పినట్లుగా ఒప్పందాల ఉల్లంఘన, తదితర అంశాలను చర్చించుకొని పరిష్కరించుకుందామని సూచించారు. విభజన వల్లే వచ్చే సమస్యలను చెప్పండని చర్చించి ముందుకెళుదామని టీ-మంత్రులు అన్నట్లు తెలుస్తోంది. ఇలా ఎవరి వాదన వారు చేయడంతో.. మంత్రుల సమావేశం ఫలితం లేనిదిగానే మిగిలిపోయింది. ఇకపై కూడా తెలంగాణ నేతలు సహకరించండి… అంటే.. సీమాంధ్రులు సమైక్యంగా వుంచండి అనే విధంగానే వుంది మంత్రుల పరిస్థితి.