Site icon TeluguMirchi.com

ఒక్కరు కూడా అక్కడ మద్యం కొనడం లేదట..

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం తో పిచ్చోళ్ళు అయ్యారు. సోమవారం నుండి అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభం మొదలు కావడం తో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొదటి రోజు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగగా… అనంతపురం జిలాల్లోని మడకశిరలో మద్యం షాపుల దగ్గర మాత్రం ఏ ఒక్కరు కూడా మద్యం కొనడానికి రావడంలేదట. కారణం ఈ షాపు కర్ణాటక బోర్డర్ లో ఉండటమే. ఏపీలో మద్యం ధరలు పెంచడంతో బోర్డర్ లో ఉన్న వ్యక్తులు మడకశిర షాపులో మద్యం కొనుగోలు చేయకుండా అక్కడికి పదికిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకకు వెళ్లి మద్యం షాపులో మద్యం కొనుగోలు చేస్తున్నారట. అక్కడి మద్యం ధర తక్కువగా ఉండడం తో జనాలంతా అక్కడికే క్యూ కడుతున్నారట.

Exit mobile version