Site icon TeluguMirchi.com

21ఏళ్లు లీవు లేదు.. రోజుకు 15గంటలు పనే : L&T చైర్మన్


లార్సెన్ & టూబ్రో (L&T) అవుట్‌గోయింగ్ ఛైర్మన్ ఏఎం నాయక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. తాను కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడూ క్లాసులకు హాజరయ్యేవాడు కాదట. కానీ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపాడు. కాలేజీ తర్వాత బయటికి వచ్చినప్పటి నుంచి అప్పటి దాకా కాలేజీకే వెళ్లని తాను ప్రస్తుతం తీరిక దొరకని వ్యక్తిగా మారిపోయానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు 21 ఏళ్ల పటు అసలు సెలవే తీసుకోకుండా రోజుకి 15 గంటల పాటు పని చేసేవాడినని చెప్పుకొచ్చారు. చాలా సార్లు తాను అర్ధరాత్రి 12 గంటలకు చివరి బస్సును మిస్ అయ్యేవాడిని. అప్పుడు తన ఆఫీస్ టేబుల్‌పై పడుకునేవారని చెప్పారు.

ఇకపోతే అనిల్ మణిభాయ్ నాయక్(ఏఎం నాయక్) సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయబోతున్నాడు. అయితే L&T యొక్క ఉద్యోగుల ట్రస్ట్ ఛైర్మన్‌గా కొనసాగుతారు. లార్సెన్ & టూబ్రో (L&T)లో ఒక యువ ఇంజనీర్ గా తన వృత్తిని ప్రారంభించిన నాయక్ దాదాపు ఆరు దశాబ్దాల పాటు L&T కి తన సేవలనందించారు.

Exit mobile version