కోవిడ్ కు సంబంధించి ప్రభుత్వం సూచించిన ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3 గిరిజన తండాలు ఒక్క కోవిడ్ పాజిటివ్ కేసు కూడ నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లోని యనగంది తండా, దుబ్బగుండ్లా తండా, నల్లగోండ జిల్లాలోని చెన్నుగూడెంలలో గత ఏడాది నుంచి ఇప్పటివరకూ ఒక్క కోవిడ్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కనీసం స్వల్ప కోవిడ్ లక్షణాలు కూడా ఎవరికీ కనిపించలేదు. పోషకాహారం తీసుకోవడం, ప్రభుత్వం సూచించిన కోవిడ్ ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం వల్ల ఈ తండాలు దీనిని సాధించగలిగాయి.