Site icon TeluguMirchi.com

మెగాస్టార్ బొమ్మ లేదు !

chiruస్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయి నుంచి పార్టీని సమాయత్తం చేయడానికి కార్యాచరణ రూపొందించడమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం లో అప్పుడే ఓ వివాదం చోటుచేసుకుంది. ఈ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఫోటో లేక పోవడంతో రసాబాసకు దారితీసింది. కాంగ్రెస్ ముఖ్యనేతలందరూ ఉన్న అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై చిరంజీవి బొమ్మ ఏర్పాటు చేయకపోవడంపై ఆయన వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యనేతగా ఉండి, సమన్వయ కమిటీ సభ్యుడుగా ఉన్న చిరంజీవి ఫోటో ప్లెక్సీలలో కనిపించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌతం ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి ముఖ్యమైన కార్యక్రమంలో చిరంజీవి బొమ్మ లేకపోవడం విచారకరమని ఆయన అన్నారు. అయితే ఆగ్రహం తో ఉన్న చిరు వర్గ నేతలకు కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మంత్రి దానం నాగేందర్ మాట్లాడుతూ చిరంజీవి బొమ్మ లేకపోవడం పొరపాటేనని, భవిష్యత్తులో అలా జరగనివ్వబోమని అన్నారు. దింతో చిరు వర్గం చల్లబడింది.

Exit mobile version