Site icon TeluguMirchi.com

జిల్లా పేరు మార్చడం కన్ఫర్మ్‌ అంటున్న ఎంపీ

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తర భారతంలో పలు ప్రాంతాల పేర్లను మార్చడం జరిగింది. పూర్వ కాలంలో ఉన్న పేర్లు కాకుండా ముస్లీం సంబంధిత పేర్లు ఉన్న ప్రాంతాలకు పూర్వ కాలంలో ఉన్న పేర్లను పెట్టడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా నిజామాబాద్‌ పేరును మార్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ముఖ్యంగా నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ పేరును మార్పించేందుకు పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది.

నిజామాబాద్‌ పూర్వపు పేరు ఇందూర్‌. ఇప్పటికి కూడా ఇందూర్‌ అంటూ ఆ ప్రాంతంను కొందరు పిలుస్తూ ఉంటారు. అందుకే మద్యలో వచ్చిన నిజామాబాద్‌ను తొలగించి ఇందూర్‌ను పూర్తి స్థాయిలో అధికారిక పేరుగా మార్చాలని అరవింద్‌ కేంద్ర ప్రభుత్వంను డిమాండ్‌ చేస్తున్నాడు. కేంద్రంలో అధికారంలో ఉంది తమ ప్రభుత్వం కనుక ఈజీగానే ఇందూర్‌గా నిజామబాద్‌ మారుతుందని అంటున్నాడు. నిజామాబాద్‌ తర్వాత హైదరాబాద్‌ మీద ఏమైన పడతాడేమో చూడాలి. హైదరాబాద్‌ నగరం పేరు మార్చేందుకు ముస్లీంలు మాత్రమే కాకుండా హిందూవులు కూడా వ్యతిరేకిస్తారేమో. ఎందుకంటే హైదరాబాద్‌ పేరు ప్రపంచ ప్రసిద్ది గాంచింది. కనుక పేరు మారిస్తే బ్రాండ్‌ నాశనం అవుతుంది. అందుకే హైదరాబాద్‌ పేరు మార్పిడి ఏం ఉండదు అంటున్నారు.

Exit mobile version