నితీష్ ఓటు.. భాజపాకే !

nitish-kumar-comments-on-bjఎన్టీయే కూటమికి శుభావార్త. మిత్రపక్షాలైన భాజపా, జేడీ-యూల మధ్య గతకొద్దికాలంగా నెలకొన్న అంతర్గత కలహం సమసిపోయినట్లు తెలుస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు (శుక్రవారం) విలేకరులతో మాట్లాడుతూ.. భారతీయజనతా పార్టీకి భవిష్యత్ లోనూ.. మద్ధతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్డీఏ సంకీర్ణం బాగానే పని చేస్తుందని ఆయన ప్రశంసించారు.

అయితే, భాజపా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తుందన్న వార్తల నేపథ్యంలో.. బీజేపీ, జేడీ(యు)ల మధ్య ఇటీవల సంబంధాలు బెడిసికొట్టే పరిస్థతి నెలకొన్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం జేడీ(యూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో.. ప్రధాని అభ్యర్ధి ఎవరన్నది తక్షణమే తేల్చాలని కూడా నితీష్ పేర్కొన్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు విభేదాలు కాస్త వికటించనున్నట్లు కనిపించాయి.

కాగా, బీహార్ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో.. మూడు సీట్లకుగాను రెండు స్థానాలకు జేడీ(యు), ఒక స్థానానికి బీజేపీ నామినేషన్లు వేశాయి. దీంతో.. చల్లబడిన నితీష్ భవిష్యత్ లోనూ పరస్పర సమన్వయంతో పని చేస్తామని పేర్కొన్నారు. ఎన్టీయే ప్రధాని అభ్యర్థిగా మోడీని బహిరంగంగా వ్యతిరేకిస్తున్న.. బీహార్ సీఎం తాజా ప్రకటనతో.. బీజేపీ కూటమిని కాస్త కుదుటపడేలా చేశాయి.