Site icon TeluguMirchi.com

‘యూటీ’ కి నో ఛాన్స్ !

రాష్ట్ర విభజన నేపధ్యం లో ‘హైదరాబాద్’ పై వస్తున్న అనేక ఊహాగానాలపై కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలంగాణ ప్రకటన చేసిన వరంగల్ లో నిర్వహించిన సభలో జైపాల్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రథ చక్రాలు కదిలాయని, ఉద్యమాల ఫలితాలు అనుభవించడానికి సంయమనం అవసరమని సూచించారు. దశాబ్దాలుగా దశలవారీ ఉద్యమ ఫలితమే ప్రత్యేక తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంత టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు సోనియాను విమర్శిస్తున్నారన్న జైపాల్ రెడ్డి… తెలంగాణ ఇస్తానని కాంగ్రెస్ చెప్పిందని ఆ తర్వాత ఇచ్చిందన్నారు. ఏదేమైనా సీడబ్ల్యూసీ తీర్మానం శిలాశాసనమని చెప్పారు. ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ మాట కాదని ఇందిరాగాంధీ హర్యానా ఇచ్చారని గుర్తు చేశారు. కీలక సమయంలో కొందరు సీమాంధ్ర నేతలు సైంధవ పాత్ర పోషిస్తున్నారని జైపాల్ రెడ్డి ఆరోపించారు.

Exit mobile version