కరోనా మహమ్మారి హైదరాబాద్ నగరంలో బుసలు కొడుతుంది. తాజాగా పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. నిమ్స్ కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్న నలుగురు వైద్యులు, ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. అప్రమత్తమైన నిమ్స్ యాజమాన్యం.. అన్ని విభాగాల అధిపతులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై చర్చించారు.
కరోనా బారిన పడిన డాక్టర్లు ఎవరెవరికి చికిత్స చేశారు? సిబ్బంది ఎవరిని కలిశారన్న దానిపై ఆరా తీశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆస్పత్రి స్పెషాలిటీ బ్లాక్‌లోని కార్డియాలజీ, గ్యాస్ట్రో విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులను డిశ్చార్జి చేశారు. అటు స్పెషాలిటీ బ్లాక్‌లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది మొత్తం 70 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు