పంజాబ్‌లోనూ కరోనా వైరస్ ఉద్ధృతి పెరిగింది. రాష్ట్రంలో బయటపడుతోన్న పాజిటివ్ కేసుల్లో 80శాతం కేసులు బ్రిటన్ స్ట్రెయిన్ రకానివే ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 9 నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకు కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతాయని.. ఈ సమయంలో రాజకీయ సభలు, సమావేశాలపై నిషేధం విధించడంతో పాటు మాల్స్, మార్కెట్ల వంటి రద్దీ ప్రదేశాల్లో జనసంచారంపై ఆంక్షలు ఉంటాయని పేర్కొంది.