దేశంలో కరోనా రెండవసారి విజృంభిస్తున్న తరుణంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా ఎక్కువైతే లొక్డౌన్ విధించే బాధ్యత రాష్ట్రాలకు ఇచ్చారు. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. కరోనా కట్టడిలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 28(ఆదివారం) నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.