ఏపీలో ఈరోజు మంగళవారం నుండి నైట్ కర్ఫ్యూ మొదలుకాబోతుంది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలుకానుంది. నైట్ కర్ఫ్యూ తో పాటు కొన్ని కొత్త నిబంధనలను కూడా ప్రభుత్వం ఆదేశించింది.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ రూల్స్ ను బ్రేక్ చేసిన వారికి రూ. 1000 జరిమానా విధించాలని నిర్ణయించింది. శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాల కోసం బహిరంగ ప్రదేశాల్లో అయితే గరిష్టంగా 200 మంది, ఇండోర్‌లో అయితే 100 మందికి అనుమతులు ఇచ్చింది. ఈ కార్యక్రమాలకు హాజరయ్యేవారు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. సినిమా హాళ్లలో 50 శాతం సీటింగ్‌కు అవకాశం కల్పించింది.