రాజకీయం చేయకండి!

jammukashmirకిష్ట్‌వార్ సంఘటనపై దర్యాప్తు నివేదిక ఆధారంగా తక్షణమే చర్య తీసుకుంటామని, అనవసరపు వాదనలను నమ్మొద్దని తమ రాష్ట్ర ప్రజలకు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. కిష్ట్‌వార్ సంఘటనను రాజకీయం చేయకండని ప్రతి పక్షాలకు సూచించారు. ప్రజల మనోభావాలతో ఆడుకునే రాజకీయ పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు. కిష్ట్‌వార్ మతఘర్షణల్లో ఇద్దరు మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మతఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించేందుకు అరుణ్ జైట్లీతో సహా రాజకీయ నాయకులెవరినీ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. కాగా, కిష్ట్‌వార్ జిల్లాలో పర్యటించేందుకు వచ్చిన బీజేపీ నేత అరుణ్‌జైట్లీని జమ్మూ ఎయిర్‌పోర్టులో పోలీసులు నిర్బంధించిన సంగతి తెలిసిందే. కిష్ట్‌వార్ జిల్లాలో చెలరేగిన మత ఘర్షణల నేపథ్యంలో ఆరు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు.