కరోనా మహమ్మారి ఎవర్ని వదిలిపెట్టడం లేదు..చిన్న , పెద్ద , ధనికులు , పేదవారు ఇలా ఏ తేడా లేకుండా అందరికి సోకుతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఈ వైరస్ సోకగా..తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు సైతం కరోనా సోకింది. బోరిస్‌కు వైరస్ తీవ్రత పెరగడంతో వైద్యులు ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత ఏడు రోజులుగా ఆయన క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.. కానీ వైరస్ లక్షణాలు ఎక్కువ గా ఉండడం తో ఆయన ఆరోగ్యం ఫై అంత టెన్షన్ పడుతున్నారు.
మరోపక్క బ్రిటన్ ప్రధాని త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ‘‘బోరిస్ జాన్సన్ అతిత్వరలో ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు ప్రధాని. మరోవైపు ప్రపంచ దేశాధినేతలు కూడా బోరిస్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము అన్నారు.
Hang in there, Prime Minister @BorisJohnson! Hope to see you out of hospital and in perfect health very soon.
— Narendra Modi (@narendramodi) April 6, 2020