నమంబర్ 1, 2021 న విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు, నూతన ఓటరు నమోదుకు, ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చునని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం 2021 సంవత్సరం ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1 విడుదల చేసిన నేపథ్యంలో అట్టి ఓటరు జాబితాలో పేరు, అడ్రస్, తొలగింపు లాంటి మార్పులు చేర్పులు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చును అలాగే జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు వయస్సు పూర్తయిన వారు కూడా నవంబర్ 30 తేదీలోగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నియోజకవర్గ ఈఅర్ఓకు (డిప్యూటీ కమిషనర్ కార్యాలయం) కానీ, www.nvsp.in, ఓటరు హెల్ప్ లైన్ యాప్ ద్వారా గాని నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చునని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు