Site icon TeluguMirchi.com

వాహనదారులు జాగ్రత్త..మీ బండిపై చలాన్ ఉందా..అయితే సీజ్ అయినట్లే

ట్రాఫిక్ పోలీసులు రూల్స్ విషయంలో కఠినం చేసారు. ఇక ఫై వాహనాల ఫై చలాన్లు ఉంటె సీజ్ చేసేందుకు డిసైడ్ అయ్యారు. కొంతమంది వాహనదారులు తమ వాహనాలపై ఎన్ని చలాన్లు ఉన్న వాటిని కట్టకుండా రోడ్ల ఫై తిరుగుతున్నారు. ఈ తరుణంలో పోలీసులు రూల్స్ విషయంలో సీరియస్ అయ్యారు. బండిపై పడిన చలానాలు వెంటనే కట్టేయాల్సిందే అంటున్నారు. లేదంటే ఒక్క చలానా పెండింగ్ లో ఉన్నా నిబంధనల ప్రకారం వాహనాన్ని సీజ్ చేయోచ్చు. ఈ ఈ విషయాన్ని మాదాపూర్ ట్రాఫిక్ సీఐ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

Exit mobile version