అసెంబ్లీలో రెవెన్యూ బిల్లును ప్రవేశ పెట్టిన కేసీఆర్..

తెలంగాణ అసెంబ్లీలో రెవెన్యూ బిల్లును ప్రవేశ పెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో రెవెన్యూ బిల్లు పెడుతున్నప్పుడు అంతే సంతోషంగా ఉన్నానంటూ కేసీఆర్ బిల్లు ప్రవేశ పెడుతూ అన్నారు. ఈ బిల్లు కోసం మూడేళ్లుగా కసరత్తు చేశాం. భూ రికార్డుల ప్రక్షాళనతో కొంత ఫలితం వచ్చింది. మా బాధ్యతగా రెవెన్యూ అధికారులతో చర్చించాం. ఏ చట్టం తెచ్చినా గౌరవిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు. ఈ చట్టం ఫలితంగా ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ చట్టంతో ఉద్యోగులకు ఎలాంటి ముప్పు ఉండదు. వీఆర్వోలను స్కేల్‌ ఎంప్లాయిస్‌గా మార్చుతాం. రెవెన్యూ బాగు చేసేందుకు ఆ శాఖ బాధ్యతలు తీసుకున్నానంటూ తెలియజేసారు.

అలాగే కొత్త రెవెన్యూ బిల్లు ద్వారా ధ‌ర‌ణి పోర్ట‌ల్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.‌ ఈ ధ‌ర‌ణి పోర్ట‌ల్ అన్నింటికీ ఆయువుప‌ట్టుగా ఉంటుంది. రాష్ర్టంలో 2.75 కోట్ల ఎక‌రాల భూమి ఉంద‌న్నారు. ఈ పోర్ట‌ల్ నుంచి ఎవ‌రైనా వివ‌రాలు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ టెక్నాల‌జీ విధానంలో రికార్డులు భ‌ద్రంగా ఉంటాయ‌న్నారు.