దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకులు కంభంపాటి హరిబాబును ఈశాన్య రాష్ట్రం మిజోరంకు గవర్నర్‌గా నియమించారు. ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా ఉన్న పీఎస్ శ్రీధరన్ పిళ్లైను గోవా గవర్నర్‌గా నియమించారు. మరో ఈశాన్య రాష్ట్రం త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్యను నియమించారు. ప్రస్తుతం త్రిపుర గవర్నర్‌గా ఉన్న రమేష్ బైస్‌ను జార్ఖండ్ గవర్నర్‌గా నియమించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్‌గా నియమించారు. కర్ణాటక గవర్నర్‌గా థావర్ చంద్ గెహ్లాట్‌ను,మధ్యప్రదేశ్ గవర్నర్‌గా మంగుభాయ్ ఛగన్‌భాయ్ పటేల్‌ను,హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను నియమించారు. ఆయా గవర్నర్లు బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఈ నియామకాలు వర్తిస్తాయని రాష్ట్రపతి భవన్ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.