కరోనా పుట్టినిల్లు చైనా…అక్కడ నుండే ఇతర దేశాలకు పాకడం జరిగింది. అక్కడ రెండు నెలల పాటు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ మహమ్మారి ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టి ఇతర దేశాల్లో పడగ విప్పడం స్టార్ట్ చేసింది. ఇక ఈ మహమ్మారి మళ్లీ చైనా లో హలజడి సృష్టించడం స్టార్ట్ చేసింది.
చైనాలోని వుహాన్ నగరంలో గడిచిన కొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు నమోదు కాలేదంటూ అక్కడి మీడియా పలు కథనాలను వెలవరించింది. ఈ నేపథ్యంలోనే చైనాలోని దక్షిణ ప్రాంతంలో తాజాగా 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్ అధికారులు ప్రకటించారు. శనివారం నమోదైన 30 కేసుల్లో 25 మంది విదేశాల నుంచి వచ్చినవారని, ఐదుగురు మాత్రం స్థానికులేనని తెలిపింది. అలాగే కరోనా లక్షణాలతో బాధపడుతున్న మరో 62 మందిని గుర్తించామని వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. మరోసారి కరోనా కేసులు బయటపడుతుండడం తో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.