హోం మంత్రిగా చేసిన నేను ఆర్టీసి చైర్మన్‌గా ఎలా చేస్తానంటూ తాజాగా తన గురించి వస్తున్న వార్తలపై స్పందించిన సమయంలో ప్రశ్నించాడు. ఆర్టీసీ చైర్మన్ పదవి ఎవరికి కావాలన్నాడు. టీఆర్‌ఎస్ పార్టీలో నేను ఒక ఓనర్‌ను అని, కిరాయికి వచ్చిన వారు మద్యలోనే వెళ్లి పోతారంటూ ఆయన అన్నాడు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి మొదటి నుండి ఉన్న తనలాంటి వాళ్లకు అన్యాయం చేయడం ఏంటీ అంటూ నాయిని ప్రశ్నించాడు. ఈ విషయమై నాయిని ఎంత దూరం వెళ్తాడో అంటూ టీఆర్‌ఎస్ పార్టీలో ఆందోళన వ్యక్తం అవుతుంది. సమయం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ ఇలాంటి వారిని లాక్కుంటే టీఆర్‌ఎస్‌కు కష్టాలు తప్పవన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.