మార్చి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతలోని మర్కజ్ మసీదు లో ప్రార్థనలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రార్థనలకు దేశ, విదేశాల నుంచి హాజరయ్యారు. మలేసియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిస్తాన్‌తో పాటు పలు దేశాలకు చెందిన మత ప్రచారకులు వచ్చారు. ఈ మత ప్రార్థనల్లో దాదాపు 2,500 మంది పాల్గొన్నట్టు భావిస్తున్నారు. లాక్ డౌన్ విధించిన తర్వాత మర్కజ్ భవనంలోనే 1200 మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పుడు వారందరికీ కరోనా లక్షలు ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు.
ఆ భవనంలో ఉన్న అందర్నీ వరుసపెట్టి ఆస్పత్రికి తరలిస్తున్నారు. నిన్నటి నుంచి 850 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఇంకా 300కు పైగా వ్యక్తులు భవనంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మర్కజ్ భవనంలో ఉన్నవారిలో చాలా మందికి కరోనా అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. ఆస్పత్రికి తరలించిన వారిలో పలువురికి ఇప్పటికే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తెలుగు రాష్ట్రాల నుండి కూడా భారీ సంఖ్య లో అక్కడికి వెళ్లినట్లు తెలుస్తుంది.
తెలంగాణ నుంచి 380 మంది మర్కజ్ ప్రార్థనలకు వెళ్లారు. హైదరాబాద్ 186, నిజామాబాద్ 18, మెదక్ 26, నల్గొండ 21, ఖమ్మం 15, ఆదిలాబాద్ 10, రంగారెడ్డి 15, వరంగల్ 25, కరీంనగర్ 17, మహబూబ్ నగర్ 25, భైంసా 11, నిర్మల్ 11 మంది ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఏపీ నుంచి.. 711 మంది ఉన్నారు. విజయనగరం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం రూరల్‌లో ఒక్కరు, విశాఖపట్నం సిటీలో 41 మంది, తూర్పు గోదావరి జిల్లాలో ఆరుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో 16 మంది, రాజమండ్రిలో 21 మంది, కృష్ణా జిల్లాలో 16 మంది, విజయవాడ సిటీలో 27 మంది, గుంటూరు అర్బన్‌లో 45 మంది, గుంటూరు రూరల్‌లో 43 మంది. ప్రకాశం జిల్లాలో 67 మంది, నెల్లూరు జిల్లాలో 68 మంది, కర్నూల్ జిల్లాలో 189 మంది, కడప జిల్లాలో 59 మంది, అనంతపూర్ జిల్లాలో 73 మంది, చిత్తూరు జిల్లాలో 20 మంది, తిరుపతికి చెందిన 16 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఇప్పుడు వీరిద్దరికి కరోనా టెస్ట్ లు చేయిస్తున్నారు .