ఆర్టికల్ 370 రద్దు ఫై లోకనాయకుడు ఏమంటున్నాడంటే..

సోమవారం పార్లమెంట్ లో కాశ్మీర్ లో ఉన్న ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక నుంచి కాశ్మీర్‌లో కూడా కేంద్ర చట్టాలు అమలు అవుతాయని తెలిపారు. జమ్ముకాశ్మీర్‌ను కేంద్రం రెండుగా చీల్చింది. చడ్డ సభలేని కేంద్రంగా లడఖ్ ప్రాంతాన్ని ప్రకటించింది. ఈ ప్రకటన పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా..లోకనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్‌ తీవ్రంగా ఖండించాడు.

బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లుగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో నిరంకుశంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఆర్టిక‌ల్ 370, 35ఏల‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉన్న‌ద‌ని, వాటిలో మార్పులు చేయాల‌నుకుంటే, ముందుగా చ‌ర్చ‌ల ద్వారా ఆ ప్ర‌క్రియ చేప‌ట్టాల‌న్నారు.