Site icon TeluguMirchi.com

ఫ్రీ గా కరోనా టెస్ట్ లు ..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉదృతంగా ఉన్న సంగతి తెలిసిందే. కేంద్రం కరోనా కట్టడి లో భాగంగా లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ రోజు రోజుకు కరోనా వైరస్ ల కేసులు ఎక్కువ అవుతుండడం తో లాక్ డౌన్ ఫై చర్చలు లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటె తాజాగా సుప్రీం కోర్ట్ .. ప్రభుత్వ ల్యాబ్‌లతోపాటు ప్రయివేట్ ల్యాబ్‌ల్లోనూ ఉచితంగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

ఈ మేరకు ఏప్రిల్ 8న (బుధవారం) తీర్పు వెలువరించింది. ప్రభుత్వం సమాధానం చెప్పడానికి న్యాయస్థానం రెండు వారాల గడువు ఇచ్చింది. కోవిడ్ పరీక్షలను ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ పొందిన ల్యాబ్‌లు లేదా డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్ అనుమతి పొందిన ఏజెన్సీల్లో మాత్రమే టెస్టులు నిర్వహించాలని న్యాయస్థానం సూచించింది.

Exit mobile version