అగ్ర రాజ్యం అమెరికా కరోనా వైరస్ తో కుదేల్ అవుతుంది. ఇప్పటికే లక్షల సంఖ్య లో కరోనా పాజిటివ్ కేసులు , వేల సంఖ్య లో కరోనా మరణాలు సంబవిస్తుండడం తో ఏంచేయాలో కూడా అర్ధం కావడం లేదు. అధికారులు ఈ కరోనా ను కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేయడం తో ఆర్మీని రంగంలోకి దింపింది.
కొన్ని రోజులుగా అమెరికా మొత్తం వారి గుప్పిట్లోనే ఉంది. అయితే ఇప్పుడు వారికీ కూడా కరోనా సోకడం తో ఇంకాస్త తలనొప్పిగా మారింది. దాదాపుగా వెయ్యిమంది సైన్యానికి కరోనా సోకినట్టుగా అమెరికా అధికారులు చెప్తున్నారు. ఇందులో 300 మంది నేషనల్ గార్డ్స్ ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రజలను కాపాడేవారికే కరోనా వస్తే ఇక ప్రజలకు దిక్కేది అని అంత మాట్లాడుకుంటున్నారు.