ఇక మోడీ ఎవరి పేరు చెబితే వారే రాష్ట్రపతి

modiపది సంవత్సరాల కాంగ్రెస్‌ పరిపాలనతో విసిగి పోయిన దేశ ప్రజలకు ఆశాజ్యోతిల నరేంద్ర మోడీ కనిపించారు. గుజరాత్‌లో చేసిన అభివృద్దిని దేశ వ్యాప్తంగా చేస్తాడనే నమ్మకంతో ప్రజలు నమ్మారు. అనూహ్యంగా ప్రధాని రేసులోకి దూసుకు వచ్చిన మోడీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. చాలా సంవత్సరాల తర్వాత కేంద్రంలో ఒక పార్టీ సొంతంగా ప్రభుత్వంను ఏర్పాటు చేయగలిగింది అంటే మోడీ ప్రతిభ అంటూ ప్రతి ఒక్కరు ఒప్పుకున్నారు. అయితే మోడీ చేస్తున్న సంస్కరణల కారణంగా ఎక్కువ కాలం ఆయన క్రేజ్‌ ఉండదని కూడా కొందరు అన్నారు. కాని అందరి అంచనాలు తారు మారు చేస్తూ అప్పుడు ఎంతగా మోడీ ప్రభంజనం సాగిందో ఇప్పటికి కూడా అంతే ప్రభంజనంను మోడీ కొనసాగిస్తున్నారు.

తాజాగా జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ ప్రభంజనం క్లీయర్‌గా కనిపించింది. ముఖ్యంగా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మోడీ ఏ స్థాయిలో ప్రభజంనం సృష్టించాడో తాజాగా వెళ్లడైంది. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకున్న మోడీ తీవ్రంగా ప్రచారం జరిపారు. ఈ ఎన్నికల్లే త్వరలో జరుగబోతున్న రాష్ట్రపతి ఎన్నికలను శాషించనున్న నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం మొత్తం ఈ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఈ ఎన్నికలతో రాజ్యసభలో కూడా బీజేపీ మరింత బలం పెరిగే అవకాశాలున్నాయి. మొన్నటి వరకు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఆ పార్టీ, ఈ పార్టీని బతిమిలాడే పరిస్థితి. కాని ప్రస్తుతం బీజేపీ మరియు దాని మిత్ర పక్షాల మద్దతుతో మోడీ ఎవరి పేరు సూచిస్తే వారే రాష్ట్రపతి అవ్వడం ఖాయం. మోడీ ప్రభంజనం మరింతగా దేశంలో పెరిగిందని చెప్పవచ్చు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిన నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల పక్రియ మొదలు అయ్యే అవకాశాలున్నాయి.