కరోనా కట్టడి కోసం మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. 21 రోజుల లాక్డౌన్ గడువు ముగుస్తుండటంతో.. దాన్ని పొడిగిస్తారనే భావన వ్యక్తం అవుతోంది.ఈ రోజు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో లాక్డౌన్ను పొడిగించాలని ముఖ్యమంత్రులు ప్రధానికి సూచించారు. కాగా లాక్డౌన్ పొడిగించాలన్న సూచనకు ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించారు
ఈ విషయాన్ని ఢిల్లీ సిఏం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. లాక్డౌన్ను దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు పొడిగించాలని ప్రధాని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం కరోనా వల్ల అతలాకుతలమైన అనేక దేశాలతో పోలిస్తే భారత్లో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని , లాక్డౌన్ను సత్వరమే అమలుపరచడమే ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ లాక్డౌన్ ఎత్తివేస్తే.. ఇప్పటిదాకా చేసిందంతా వృధా అవుతుందని ట్వీట్ చేశారు.