ఆమే కారణం..!

cpi-slams-state-government-non-functionalతెలంగాణ సంక్షోభానికి కారణం.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఒక్కరేనని సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సీపీఐ పోరాటాన్నిమరింత ఉధృతం చేయనుంది. ఈ నెల 15 నుంచి వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తామని  నారాయణ తిరుపతిలో తెలిపారు.  ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. అందుకే తెలంగాణ జేఏసీకీ తాము దూరంగా ఉంటున్నామని నారాయణ వివరించారు.