సీఎం తోలు తీసేవాళ్లట!

CPI-Narayanaముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై సీపీఐ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. తెలంగాణకు నక్సలిజంతో ముడి పెట్టడమంటే.. బట్టతలకు, మోకాలికి ముడి పెట్టడమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కాంగ్రెస్ పార్టీపైన, ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపైన ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లీకులు ఇవ్వకుండా అధికారికంగా నక్సలిజం గురించి చెప్పి ఉంటే ముఖ్యమంత్రికి తోలు తీసి ఉండేవాళ్లమని ఆయన మండిపడ్డారు. కిరణ్ చెప్పిన మాటలు వినేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చెవిలో క్యాబేజీ పూలేమైనా పెట్టుకుందా? అని ప్రశ్నించారు. తెలంగాణపై ఇంకా నాన్చితే కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలవడం ఖాయమని నారాయణ స్పష్టం చేశారు.