Site icon TeluguMirchi.com

కేసీఆర్‌ ప్రభుత్వంకు గవర్నర్‌ షాక్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మున్సిపల్‌ చట్టంను తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ చట్టంలో పలు నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. ఉద్యోగస్తులు ఏమాత్రం కాస్త అలసత్వంను కనబర్చినా కూడా వారిని ఉద్యోగం నుండి తొలగించడంతో పాటు కఠిన నిర్ణయాలు తీసుకునే అధికారంను కొత్త చట్టంలో కల్పించడం జరిగింది. అయితే ఆ కొత్త మున్సిపల్‌ చట్టంను తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించకుండా వెనక్కు పంపించాడు.

గవర్నర్‌ వద్దకు వెళ్లిన మున్సిపల్‌ చట్టం రాజ్యాంగ బద్దంగా లేదంటూ వెనక్కు పంపించాడట. కొన్ని అంశాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందంటూ వెనక్కు పంపించడం జరిగింది. ఈ బిల్లును కేంద్రంకు కూడా పంపించాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ అభిప్రాయ పడ్డాడట. అందుకే ఆమోదించకుండా ఆపేయడం జరిగింది. గవర్నర్‌ చెప్పిన చట్టం సవరింపులకు ఇప్పుడు సభ సమావేశం సాధ్యం కాదు కనుక ఆర్డినెస్స్‌ తీసుకు వచ్చి సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎప్పుడు కూడా సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా ఉండే గవర్నర్‌ ఈసారి మాత్రం షాక్‌ ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది.

Exit mobile version