ఆ విమర్శలు బాధ పెట్టాయి

ఒక రాష్ట్రంకు గవర్నర్‌గా ఒక వ్యక్తి అయిదు లేదా ఆరు ఏళ్లు ఉండటం చాలా ఎక్కువగా అంటూ ఉంటారు. కాని మాజీ గవర్నర్‌ నరసింహన్‌కు మాత్రం అనూహ్యమైన రికార్డ్‌ దక్కింది. ఆయన ఏకంగా 9 సంవత్సరాల పాటు గవర్నర్‌గా కొనసాగాడు. రాష్ట్రం విడిపోక ముందు నుండి విడిపోయిన తర్వాత కూడా దాదాపు ఆరు సంవత్సరాల పాటు ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగాడు. ఆయన ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ కేంద్రం వద్ద నమ్మిన బంటు అన్నట్లుగా ఉండేవాడు.

ఇక నరసింహన్‌ విషయంలో ఎక్కువగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగిన ఇష్యూ ఏంటీ అంటే ఆయన దైవ భక్తి. ఎప్పుడు ఏదో ఒక గుడికి వెళ్లడం.. ఏ ప్రదేశంకు వెళ్లినా కూడా అక్కడ గుడులను దర్శించడం చేస్తాడు. చొక్కా విప్పి ఆయన దైవ దర్శనంకు వెళ్లిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా కూడా ఆయన ఏదో గుడికి వెళ్లాడు. అయితే ఆ విషయాలన్నింటిపై తాజాగా మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో స్పందించిన నరసింహన్‌ తన దైవ భక్తి గురించి మీడియాలో వచ్చిన వార్తలు బాధ పెట్టాయి. ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి. వాటిని కించపర్చడం కరెక్ట్‌ కాదన్నాడు. గవర్నర్‌గా తప్పుకున్న తర్వాత ఆయన మరే బాధ్యతలు తీసుకోకుండా తన సొంత రాష్ట్రం అయిన తమిళనాడులో సెటిల్‌ అవుతానంటూ ప్రకటించాడు.