నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీ!

nara-rohith

’ప్రతినిధి’ పాజిటివ్ టాక్ తో జోష్ మీదున్నాడు నారా రోహిత్. ఈ ఊపులోనే పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చేశాడు. పచ్చజెండా పట్టి ప్రచారంలో పాల్గొన్నాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా.. ఎన్నిక వేళ తెదేపాకు తన వంతుగా ప్రచారం చేయడానికి ముందుకొచ్చారు సోలో హీరో. సినిమా షూటింగ్ లకు విరామం ప్రకటించి.. పది రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. శుక్ర‌వారం సీమాంధ్ర‌లో నారా రోహిత్ విస్తృతంగా ప్ర‌చారం చేస్తూ.. స్థానిక తెదేపా అభ్య‌ర్థుల‌ను గెలిపించాల్సిందిగా ఓటర్ల‌ను విజ్ఞప్తి చేశాడు.  పెదనాన్న చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి తన వంతు కృషి చేస్తున్నాడు రోహిత్. 2004 ఎన్నికల్లో ప్రచారం చేసిన జూ. ఎన్టీఆర్ ఇప్పుడు మొహం చాటేశాడు. ఈ నేపథ్యంలో.. ’ప్రతినిధి’ హిట్ టాక్ తో ప్రజల్లో నానుతున్న రోహిత్ తెదేపా తరుపుముక్కగా మారాడు. ఇప్పుడిప్పుడే నాయకుడిగా ఎదుగుతున్న లోకేష్ కి సినీగ్లామర్ వున్న రోహిత్ ను జత చేసి భవిష్యత్ లో చక్రం తిప్పలానుకుంటున్నాడేమో.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.