Site icon TeluguMirchi.com

కిక్ బాక్సింగ్ పై మనసుపడ్డ లోకేష్

Lokesh--kik-boxingటీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఓ వైపు వ్యాపారం చేస్తూనే మరోవైపు రాజకీయాల క్రమంగా క్రియాశీలంగా పాల్గొంటూ ప్రత్యర్థుల విమర్శలపై తనదైన శైలిలో స్పందిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు మన చినబాబు మనసు హఠాత్తుగా కిక్ బాక్సింగ్ మీద మనసు పడిందట. ”రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా” అనుకున్నదే తడవు ఇంట్లోనే ఉన్న జిమ్ లో దానికి సంబంధించిన వస్తువులు తెచ్చుకుని కోచ్ రఘు ఆధ్వర్యంలో కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టాడని సమాచారం. మానసిక, శారీరక దృడత్వం లోకేష్ ఈ వ్యాయామం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెరిటేజ్ వ్యాపారాలు చూసుకుంటున్న లోకేష్ తన భార్య బ్రాహ్మాణి విదేశాల నుండి రాగానే ఆమెకు వ్యాపార వ్యవహారాలు అప్పగించి లోకేశ్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు.

2009 ఎన్నికల్లో పార్టీ తరపున నగదు బదిలీ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టి వెలుగులోకి వచ్చిన నారా లోకేష్ ఇటీవల తండ్రి ‘వస్తున్నా… మీకోసం’ పాదయాత్ర ప్రారంభం నుండి కీలకంగా వ్యవహరిస్తున్నాడు. పాదయాత్రలో పాల్గొని పార్టీ కార్యకర్తలను ఆకట్టుకునేందుకు యత్నించిన లోకేష్ ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ లపై ట్విట్టర్ లో విమర్శలు చేసి హాట్ టాపిక్ గా మారారు. ఇక తండ్రి ‘వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర పూర్తికాగానే తను సైకిల్ యాత్ర మొదలు పెట్టాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. సైకిల్ యాత్ర దృష్టిలో ఉంచుకొని కూడా వ్యాయామం మీద మనసు పడ్డట్లు తెలుస్తోంది. మరీ లోకేశ్ బాబు తన సైకిల్ యాత్ర ద్వారా ప్రజల్లో ఏవిధమైన ఆధరాభిమానులు అందుకుంటాడో వేచి చూడాల్సిందే..!

 

Exit mobile version