టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ..మరోసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై విరుచుకపడ్డారు. మాములుగా ఈసారి మామ బాలయ్య డైలాగ్ లతో అదరగొట్టాడు.
‘గుడివాడలో కొడాలి నాని క్యాసినో నడిపితే నో పోలీస్.. అదే గడ్డం గ్యాంగ్ ప్రతిపక్షనేతని బూతులు తిడితే నో పోలీస్.. చంద్రబాబు గారి ఇంటి పై దాడి చేస్తే నో పోలీస్.. టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ మూకలు ధ్వంసం చేస్తే నో పోలీస్. బూతులేంట్రా సన్నాసి నాని అని బుద్ధా వెంకన్న గారు నిలదీస్తే బిలబిలమంటూ వచ్చి అరెస్ట్ చేశారు పోలీస్. ఏపీ పోలీసులు ప్రజారక్షణకి ఉన్నారా? నేరాలు చేసే వైసీపీ నేతలకు కాపలా కాస్తున్నారా?’ అంటూ లోకేష్ సర్కారు తీరు ఫై మండిపడ్డారు.
మంత్రి కొడాలి నానిపై విమర్శలు చేశారనే ఆరోపణలపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సోమవారం అర్ధరాత్రి బుద్ధా వెంకన్న బెయిల్‌పై విడుదలయ్యారు.