Site icon TeluguMirchi.com

లోకేష్ పై బండ్ల బాంబ్


టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ నారా లోకేశ్ పై వరుస ట్వీట్లు చేశారు. “గౌరనీయులైన నారా లోకేశ్ గారికి ప్రేమతో…” అంటూ . నారా లోకేశ్… రాజకీయాల్లో వారసత్వం కాదు, దమ్ము, ధైర్యం, పోరాడతాడన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడం ముఖ్యమని వ్యాఖ్యానించారు.

నారా లోకేశ్… రాజకీయ పార్టీ అంటే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ కాదు, మన పార్టీలో ఉండే నాయకులు అంటే మనవద్ద పనిచేసే ఉద్యోగులు కాదు, ప్రతి ఒక్కరినీ ప్రేమించి, ప్రేమను పంచి మనలో ఒకరిగా చేసుకుని ప్రజలకు సేవ చేయాలి అని వివరించారు.

“మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే… మీ తండ్రి మీ గురించి గర్వంగా నిద్రపోయే రోజు రావాలి. ఆ విధంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరన్నా, మీ నాన్నగారన్నా, మీ తాతగారన్నా గౌరవం, ప్రేమ కాబట్టే ఈ విన్నపం చేస్తున్నా… ప్రేమతో మీ బండ్ల గణేశ్” అంటూ ట్వీట్లు చేశారు.

Exit mobile version