Site icon TeluguMirchi.com

కరోనా కిట్లు .. జగన్ కక్కుర్తి పడ్డారా ?


కరోనాపై నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ కిట్ల ద్వారా హాట్ స్పాట్‌‌లలో కరోనా పాజిటివ్ కేసులను త్వరగా గుర్తించే వీలుంది. కాగా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కొనుగోళ్లలో జగన్ సర్కారు అవినీతి తెరతీసిందనే ఆరోపణలు వచ్చాయి. కిట్ల కొనుగోలులో కోట్లాది రూపాలయ కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆరోపించగా… కన్నా రూ. 20 కోట్లకు అమ్ముడుపోయారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. కరోనా టెస్టింగ్ కిట్లలో అవినీతి చోటుచేసుకుందని… వైసీపీ ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తి పడిందని కేశినేని నాని మండిపడ్డారు. అధిక ధరలకు టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రజాధనాన్ని దుర్వనియోగం చేశారని విమర్శించారు. జగన్ కు ప్రజల రక్షణ కన్నా… రాజకీయాలే ప్రధానమని , ఇప్పటికీ జగన్ తన తీరు మార్చుకోవడం లేదని దుమ్మెత్తిపోశారు నాని.

Exit mobile version