ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్త లిఫ్ట్ లపై సమీక్ష

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా నిర్మించ తలపెట్టిన లిఫ్ట్ ల డి పి ఆర్ లు జూన్ 15 నాటికి సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా లో కొత్తగా నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించిన లిఫ్ట్ ల నిర్మాణాలతో పాటు యస్ ఆర్ యస్ పి 69,70,71 డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ఆధునీకరణ,అయిటిపాముల లిఫ్ట్ నిర్మాణం, బునదిగాని, ధర్మారెడ్డి,పిల్లయిపల్లి కాలువ నిర్మాణాల పురోగతి పై ప్రత్యేక సమీక్షా నిర్వహించారు.