ఈ నెల 17వ తేదీన జరగబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నిక సుర్క్షితంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి శశాంక గోయల్ చెప్పారు. పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు జరుగుతుంది. ఈ సాయంత్రం 7 గంటలకు ప్రచారం ముగుస్తూనే బయట వ్యక్తులు నియోజకవర్గం విడిచి వెళ్లాలనీ, 2 లక్షల 20 వేల మంది ఓటర్లకు 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 3 వేల మంది పోలింగ్ సిబ్బంది, 2 వేలమంది పోలీసులు వీధుల్లో ఉంటారు. 346 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కొక్క దానిలో 3 బాలట్ యూనిట్లు, ఒక కంట్రోలింగ్ యూనిట్ వాడతారు. సుమారు 8 వేల పోస్టల్ బాలట్ లను ఉద్యోగులు, దివ్యాంగులు, కరోనా రోగులకు జారీ చేశారు.