జూన్ 3న బీజేపీ చేరనున్న నాగం !

nagam-BJPనాగం కర్నూల్ ఎమ్మెల్యే, నగరా సమతి పార్టీ అధినేత నాగం జనార్ధన్ రెడ్డి జూన్ 3న భారతీయ జనతాపార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న నాగం తెలంగాణ విషయంలో అధినేత చంద్రబాబు నాయుడుతో విభేదించి పార్టీని వీడిన సంగతి తెలిసిందే. అయితే, తెదేపాను వీడిన అనంతరం ఏ పార్టీలో చేరకుండా తెలంగాణ అజెండగా తెలంగాణ నగరా సమితి పార్టీని స్థాపించి స్వతంత్రంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2012 ఉపఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందిన నాగం గత కొద్దికాలంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. వస్తున్నారు. తాజాగా నాగం విలేకరులతో మాట్లాడుతూ.. జూన్ ౩న తెలంగాణ నగరా సమితిని బీజీపీలో విలీనం చేయబోతున్నట్లు వెల్లడించారు. 2014 ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బీజేపీ వలనే సాధ్యమవుతుందని నాగం మరోసారి స్పష్టం చేశారు.కాగా, వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి నాగం వర్సెస్ కేసీఆర్ అయ్యేలా ఉంది. ఎందుకంటే మహబూబ్ నగర్ ప్రస్తుత కేసీఆర్ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే. కేసీఆర్ మరోసారి అదే స్థానం నుంచి బరిలోకి దిగితే మాత్రం పోటీ మరింత రంజూగా ఉండే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.