Site icon TeluguMirchi.com

నాగాలాండ్ తొలి మహిళా ఎమ్మెల్యేగా హెకానీ జఖాలు


నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు సరికొత్త చరిత్రను లిఖించాయి. తొలిసారి ఓ మహిళా ఎమ్మెల్యే అసెంబ్లీలో కాలుమోపనున్నారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మొదటి మహిళగా హెకానీ జఖాలు రికార్డు సృష్టించారు. షనల్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ(NDPP)అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె.. దిమాపుర్‌ స్థానం నుంచి 1,536 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 60 ఏళ్ల క్రితం 1963లో నాగాలాండ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభించింది. అప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రంలో 13 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి.
కానీ, ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీ లో అడుగుపెట్టకపోవడం గమనార్హం.

Exit mobile version